Saturday, September 7, 2024

చిట్టీల పేరుతో ప్రభుత్వ ఉద్యోగి మోసం

Must Read

అక్షరశక్తి, హసన్ పర్తి : పది మందికి పాఠాలు బోధించి విద్యార్థులను స‌న్మార్గంలో న‌డిపించి, ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మోసాలకు పాల్పడుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ చిట్టీల వ్యాపారం కొనసాగిస్తూ మోసాలకు పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగిపై బాదితుల ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ జవ్వాజి సురేష్ తెలిపారు. ఇన్ స్పెక్టర్ సురేష్ కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే… హనుమకొండ రాంనగర్ కు చెందిన కామ మాధవి 2011 నుంచి 2021 వరకు హసన్ పర్తి మండలం మడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేసింది. ఆమె పని చేస్తున్న కాలంలోనే ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన అమ్మ కృష్ణను లక్ష్మీ సాయి చిట్స్ అనే పేరుతో చిట్టి వేయించుకొని మోసానికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. అంతే కాకుండా ఆమె వద్ద చిట్టి వేస్తే ఒక నెల (చివరి నెల) డబ్బులు కట్టనవసరం లేదని మంచి లాభంతో చిట్టి డబ్బులు ఇస్తానని నమ్మబలికి నెలకు రూ.12,500 చొప్పున మొత్తం 22 నెలల పాటు రూ.2.75 లక్షలు అన్ లైన్ పెమెంట్ ద్వారా మాధవి, ఆమె అసిస్టెంట్ వెంకట్ కు చెల్లించినట్లు బాధితుడు తెలిపాడు. చిట్టి కమిట్ మెంట్ ప్రకారం జూన్ 2023 నాటికి రూ.3.95 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు తిరిగి చెల్లించ కుండా మోసం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మాధవితో పాటు ఆమె అసిస్టెంట్ వెంకట్ పై చట్ట పరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితుడు కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు చిట్టి పేరుతో మోసానికి పాల్పడిన నిందితురాలు ప్రస్తుతం దామెర ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న కామ మాధవి, ఆమె అసిస్టెంట్ వెంకట్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్ స్పెక్టర్ జవ్వాజి సురేష్ తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img