Monday, September 16, 2024

కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్టు–స్పందించిన మంత్రి తుమ్మల

Must Read

అక్ష‌ర‌శ‌క్తి భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా లోని  పెద్ద వాగు ప్రాజెక్ట్ గేట్ల వద్ద భారీ గండి.. ఖాళీ అయిన పెదవాగు ప్రాజెక్టు.. గ్రామాల్లోకి ముంచెత్తిన నీరు. గురువారం రాత్రి కట్టకు పడిన గండి అర్థరాత్రి తర్వాత క్రమంగా పెద్దదైంది.. దీంతో వందల ఎకరాల్లో పంట నష్టం. భారీ వర్షం కారణంగా రాత్రికి రాత్రే వరద ముంచెత్తి 70 ఇళ్లలోకి నీరు, కూలిన 15 ఇళ్లు.. 200పైగా పశువుల మృత్యువాత. అయితే ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.100 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ విశ‌యం తెలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టును ఆదివారం పరిశీలించి, జ‌రిగిన న‌ష్టాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.Thummala Nageswara Rao: తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో పోలీసులు సోదాలు.. -  NTV Telugu

ప్రాజెక్టుకు 35-40 వేల క్యూసెక్కుల వరదను తట్టుకునే సామర్థ్యం ఉండగా, ఇప్పుడు వర్షాలకు 80 వేల క్యూసెక్కులు పోటెత్తే వరకు గేట్లు ఎందుకు ఎత్తలేదు.. గతంలో ప్రాజెక్టు మరమ్మతులకు రూ.2 కోట్లు వెచ్చించారు, అయినా కట్టకు ఎందుకు గండి పడిందంటూ అధికారులపై మండిపడ్డ తుమ్మల.

అధికారుల తీవ్ర నిర్లక్ష్యమే ప్రాజెక్టు గండికి కారణమని స్థానిక రైతులు తుమ్మల దృష్టికి తీసుకురాగా.. త్వరలోనే ప్రాజెక్టు రీడిజైన్ చేసి ఇప్పుడున్న 3 గేట్లకు గాను మరో 3 గేట్లు అదనంగా ఏర్పాటు చేసి రాబోయే వానాకాలం లోపు ప్రాజెక్టు నిర్మిస్తాం అని తుమ్మల హామీ ఇచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img