ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు
అక్షరశక్తి, భూపాలపల్లి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వచ్చారు. ఎంక్వస్ బృదం నిర్వహించిన ఆసుపత్రుల పరిశీలనలో భాగంగా రాష్ట్రస్థాయిలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డితో కలిసి మండలంలోని రూపిరెడ్డిపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రామన్నగూడలోని పాండవులగుట్ట సందర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.