అక్షరశక్తి, భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో ఈరోజు మధ్యాహ్నం పురాణం స్వరూప 40 అనే మహిళ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. పంచాయితీ కోసం కాలనీకి వచ్చిన మహిళపై తన మరిది కత్తితో దాడి చేసి హతమార్చినట్లు తెలిసింది. మృతురాలి భర్త నాలుగు నెలల క్రితం చనిపోగా రాజు, కిషోర్ అనే తన ఇద్దరు పిల్లలు తన మరిది వద్ద ఉంటున్నారని స్థానికులు తెలిపారు పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడి పిల్లలను తన వద్దకు తీసుకెళ్లడానికి నేడు పంచాయతీ పెట్టకోగా పంచాయితీకి వచ్చిన పెద్దల సమక్షంలోనే స్వరూప మరిది నాపై పంచాయతీ పెడతావా? అంటూ!స్వరూప పై తన మరిది ఒక్కసారిగా కత్తితో దాడి చేసి మెడ కోసి చంపినట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా, గత వారం రోజుల కిందట తన మరిది వల్ల ప్రాణ భయం ఉన్నట్లు మృతురాలు స్వరూప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు చేయవలసి ఉంది.