Monday, September 16, 2024

యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారద్దు – వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: గంజాయి మరియు ఇతర మ‌త్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై కేయుసి పోలీసుల కిట్స్ కళాశాలలో డివిజన్ పోలీసుల అధ్వర్యంలో కిట్స్ ఇంజనీరింగ్‌ కళాశాలలో విధ్యార్థులకు గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ అంబర్‌ కిషోర్‌ ఝా ముఖ్య అతిధిగా పాల్గోని విద్యార్థులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో వుందని. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ విద్యార్థులకు సూచించారు. ఈ ప్రమాదం భారీన పడకుండా యువత అప్రమత్తంగా వుండాలని. కేవలం క్షణికానందం కోసం మత్తు పదార్థాల సేవించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడం ఓ కలగానే మిగిలి పోతుందని. కొంత మంది వ్యక్తులు తమ డబ్బు సంపాదన కోసం గంజాయి లాంటి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడి యువతకు అందించడం జరుగుతోందని. ఇలాంటి స్వార్థపరుల చేతుల్లో యువత బలికావద్దని. ఎన్నో అశలతో మిమ్మల్ని ఉన్నత చదువులు చదివించి మీ బంగారు భవిష్యత్తుకై ఎదురుచూసే తల్లిదండ్రులకు తమ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారడంతో తల్లిదండ్రులు ఎలాంటి వేదనకు గురౌవుతున్నారు. ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి
మత్తు పదార్థాల వినియోగం ద్వారా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయని యువత గ్రహించాలని. అలాగే మీ తోటి మిత్రులు గంజాయిని సేవిస్తున్నట్లయితే మత్తు పదార్థాల వినియోగం ద్వారా నష్టాలపై వారి అవగాహన కల్పించాలని. ప్రధానంగా గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం ప్రత్యేక చోరవ చూపిస్తోందని. ఇందులో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి నియంత్రణకై డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా మత్తు పదార్థాలు సేవిస్తున్న, రవాణా, విక్రయాలు పాల్పడుతున్న వారిపై పట్టుకోవడే ఈ విభాగం ప్రత్యేకతని. ఎవరైన మత్తు పదార్థాలు అమ్మిన, సేవించిన 8712584473కు సమాచారం అందించడం ద్వారా వారిపై తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని. పెద్దఎత్తున గంజాయి సమచారం అందించిన వారికి నగదు పురస్కారం కూడా అందజేయబడుతుందని. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా వుంచబడుతాయని, మనందరం గంజాయి రహిత కమిషనరేట్ గా మారుద్దామని పోలీస్ కమిషనర్ తెలిపారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రమాణం చేయించడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాల్ పోస్టర్లను పోలీస్ కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సమావేసంలో సెంట్రల్ జోన్‌ డిసిపి షేక్ సలీమా, హనుమకొండ ఎసిపి దేవేందర్ రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, నార్కోటిక్ విభాగం ఏసీపీ సైదులు, కిట్స్ ఇంజరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి, కె యూసి ఇన్స్ స్పెక్టర్ సంజీవ్, నార్కోటిక్ విభాగం ఇన్స్ స్పెక్టర్ సురేష్తో పాటు కళాశాల అధ్యాపకులు, విధ్యార్థులు పాల్గోన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img