మానుకోట జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. గార్ల మండల జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల సస్పెన్షన్‌కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పార్టీకి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది.