22.7 C
Hyderabad
Homeతాజా వార్తలువివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య!

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య!

📰 Generate e-Paper Clip

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య

నిద్రిస్తున్న సమయంలో దుప్పటితో ఊపిరాడకుండా చేసి హత్య

గుండెపోటుతో మృతి చెందినట్లు చిత్రీకరించే యత్నం

అయోధ్యపురంలో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన

భార్య మంజుల, ప్రియుడు రాజు అరెస్ట్‌..

హత్యకు ఉపయోగించిన దుప్పటి స్వాధీనం

అక్షరశక్తి, గూడూరు: వివాహ బంధాన్ని విస్మరించి సాగిస్తున్న అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ, ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది. నిద్రిస్తున్న సమయంలో దుప్పటితో ఊపిరాడకుండా చేసి, గొంతు నులిమి ప్రాణాలు తీసిన అమానవీయ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురంలో వెలుగుచూసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మంజుల (36)కు ఆవుదెడ్డి రాజు (26)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధానికి భర్త సారయ్య అడ్డుగా ఉన్నాడని భావించి ఇద్దరూ కలిసి హత్యకు పథకం రచించారు. నవంబర్‌ 19న రాత్రి సారయ్య నిద్రిస్తున్న సమయంలో దుప్పటితో ఊపిరాడకుండా చేసి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

హత్య అనంతరం సారయ్య గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా భార్య మంజుల, ప్రియుడు రాజును గూడూరు సీఐ వి. వినయ్‌కుమార్‌, ఎస్సై సీహెచ్‌. రమేష్‌బాబు అరెస్టు చేశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన దుప్పటి, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.