- బాలామృతం నాకు ప్రత్యేకం
– హనుమకొండ కలెక్టర్ భావోద్వేగ ట్వీట్
అక్షరశక్తి, హనుమకొండ: అధికారి అయినా అమ్మ హృదయం అత్యంత ప్రధానం అని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు జిల్లాలో నిర్వహించిన ‘పోషణ మాసం’ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ‘X’లో ట్వీట్ చేశారు. పోషణ మాసం అన్నప్రాసన వేడుకల్లో భాగంగా చిన్నారికి బాలామృతం పరిచయం చేయడం అత్యంత ప్రత్యేక క్షణాల్లో ఒకటని పేర్కొంటూ ప్రత్యేక ఫొటోను తన X ఖాతాలో భావోద్వేగ పోస్టును అందరితో పంచుకున్నారు. కలెక్టర్ గా అన్ని విభాగాల్లో పని చేసినా కొన్ని ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఇది అలాంటిదే అని కొందరు అధికారులు చెబుతున్నారు.

