21.9 C
Hyderabad
Homeతాజా వార్తలుబాబోయ్ మండి బజార్ బిర్యానీ బిర్యానీ హోటళ్లలో అపరిశుభ్రత ఆహార భద్రతా నిబంధనలకు తూట్లు మండి...

బాబోయ్ మండి బజార్ బిర్యానీ బిర్యానీ హోటళ్లలో అపరిశుభ్రత ఆహార భద్రతా నిబంధనలకు తూట్లు మండి బజార్‌లోని జఫ్రాన్, ఖుర్షీద్ బిర్యానీ హోటళ్లపై టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఫ్రిజ్‌లో ఫ్రోజన్ చికెన్ వంటగదిలో బొద్దింకలు సింథటిక్ రంగులు, సగం ఉడికించిన చికెన్ గుర్తింపు.. 12 రకాల ఉల్లంఘనలు వెలుగులోకి

📰 Generate e-Paper Clip

బాబోయ్ మండి బజార్ బిర్యానీ బిర్యానీ హోటళ్లలో అపరిశుభ్రత

ఆహార భద్రతా నిబంధనలకు తూట్లు

మండి బజార్‌లోని జఫ్రాన్, ఖుర్షీద్ బిర్యానీ హోటళ్లపై టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

ఫ్రిజ్‌లో ఫ్రోజన్ చికెన్ వంటగదిలో బొద్దింకలు

సింథటిక్ రంగులు, సగం ఉడికించిన చికెన్ గుర్తింపు..

12 రకాల ఉల్లంఘనలు వెలుగులోకి

 

అక్షరశక్తి,వరంగల్:

వరంగల్ నగరంలోని మండి బజార్‌లో బిర్యానీ ప్రియులను ఆందోళనకు గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి జఫ్రాన్, ఖుర్షీద్ బిర్యానీ హోటళ్లలో ఆహార భద్రతా నిబంధనలకు విరుద్ధంగా బేకర్ కిచెన్ బయటపడింది.

మంగళవారం టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆయా హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంటగదుల్లో అపరిశుభ్రతతో పాటు ఆహార పదార్థాల నిల్వ, తయారీలో తీవ్ర నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు.

 

ఫ్రిజ్‌లో ఫ్రోజన్ చికెన్.. సింథటిక్ రంగులు

 

తనిఖీల్లో ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్, సగం ఉడికించిన చికెన్, ఆహార తయారీలో ఉపయోగిస్తున్న సింథటిక్ రంగులను అధికారులు గుర్తించారు. వండేందుకు సిద్ధంగా ఉంచిన ఆహార పదార్థాలను మూతలు లేకుండా బహిరంగంగా ఉంచినట్లు గుర్తించారు. వంటగదిలో బొద్దింకలు సంచరిస్తుండటం, గోడలకు బూజు పట్టడం, నేల అపరిశుభ్రంగా ఉండటం అధికారులను విస్మయానికి గురిచేసింది.

 

12 రకాల నిబంధనల ఉల్లంఘనలు

 

హోటళ్లలో తనిఖీల సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను ప్రదర్శించకపోవడం, సిబ్బందికి వైద్య ఆరోగ్య అర్హత ధ్రువపత్రాలు లేకపోవడం, పురుగుల నివారణ చర్యలకు సంబంధించిన ధ్రువపత్రాలు అందుబాటులో లేకపోవడం వంటి లోపాలను గుర్తించారు. అలాగే తాగునీటి నాణ్యత పరీక్ష నివేదికలు కూడా అందుబాటులో లేవని అధికారులు గుర్తించారు. మొత్తంగా 12 రకాల ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి.

హోటళ్ల యాజమాన్యాలపై చర్యలకు సూచన

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాల్సిన హోటళ్లలో ఇలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆహార పదార్థాల నిల్వ, వంటగది పరిశుభ్రత, సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిబంధనలు పాటించకపోవడం ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సంబంధిత హోటళ్ల యాజమాన్యాలపై ఆహార భద్రతా చట్టం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సూచించారు.

ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యం

నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించి ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా బిర్యానీ వంటి ఆహార పదార్థాలు విక్రయించే హోటళ్లలో చికెన్ నిల్వ, వంట విధానం, వంటగది పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అభిప్రాయపడుతున్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.