22.2 C
Hyderabad
Homeతాజా వార్తలుసామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం

సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం

📰 Generate e-Paper Clip

– ఈ నెల 14న హనుమకొండలో ఐఎల్‌పీఏ 6వ రాష్ట్ర మహాసభ

– మహిళా స్వేచ్ఛ, సామాజిక సాధికారతపై విస్తృత చర్చలు

– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యతకు ప్రాధాన్యం

– న్యాయవాదులు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలి

– న్యాయవాది, అసైన్డ్ భూమి సమితి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు కలకోటి మహేందర్

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ, నవంబర్ 12: సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్‌పీఏ) 6వ తెలంగాణ రాష్ట్ర మహాసభను ఈ నెల 14న హనుమకొండలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. హనుమకొండలోని డి కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ మహాసభకు న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయవాదులు, విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు హాజరుకానున్నారు.

మహాసభలో మహిళలకు సంపూర్ణ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యత, సామాజిక సాధికారత వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. న్యాయమూర్తుల నియామక విధానం ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉందా అనే అంశాన్ని కూడా చర్చకు తీసుకురానున్నారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే, ఛత్రపతి సాహూ మహారాజ్, పెరియార్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ఐఎల్‌పీఏ కృషి చేస్తోందని న్యాయవాది, అసైన్డ్ భూమి సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్ తెలిపారు. న్యాయవాదులు తమ వృత్తిపరమైన బాధ్యతలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను కూడా గుర్తించాలని, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కృషి చేయాలని పేర్కొన్నారు. సమానత్వ సమాజ నిర్మాణం, అణగారిన వర్గాల హక్కుల సాధనకు ఈ మహాసభ వేదికగా నిలుస్తుందని అన్నారు. మహాసభను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు, ప్రజాస్వామికవాదులు, సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలకోటి మహేందర్ కోరారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.