23.1 C
Hyderabad
Homeతాజా వార్తలురాహుల్‌గాంధీని క‌లిసిన డాక్ట‌ర్ పెరుమాండ్ల రామ‌కృష్ణ‌

రాహుల్‌గాంధీని క‌లిసిన డాక్ట‌ర్ పెరుమాండ్ల రామ‌కృష్ణ‌

📰 Generate e-Paper Clip

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని విన‌తి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్ట‌ర్‌ పెరుమాండ్ల రామకృష్ణ కలిసి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరుతూ తన బయోడేటాను రాహుల్ గాంధీకి అందించారు. రాష్ట్రంలోని మాదిగ సంఘాలు, దళిత సంఘాలు, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమకారుల సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతున్న విషయాన్ని రాహుల్ గాంధీకి డా. రామకృష్ణ వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ముఖ్యనాయకులను కలిసి రామకృష్ణకు ఎంఎల్సీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారన్నారు. విటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు రాహుల్ గాంధీకి అందజేశారు. రామకృష్ణ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి డా. పెరుమాండ్ల రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.