25.3 C
Hyderabad
Homeతాజా వార్తలుఎమ్మెల్యే మురళి నాయక్ ను కలిసిన బుడిగె సతీష్ గౌడ్

ఎమ్మెల్యే మురళి నాయక్ ను కలిసిన బుడిగె సతీష్ గౌడ్

📰 Generate e-Paper Clip

అక్షరశక్తి, హైదరాబాద్: హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ గారిని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగె సతీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సన్మానించారు. అలాగే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎమ్మెల్యే మురళి నాయక్ గారు ఉన్న అద్భుతమైన కాన్వాస్ చిత్రపటాన్ని అందించారు.

ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ఫోటో ప్రేమ్ ను ఎమ్మెల్యే గారు అత్యంత ఆసక్తిగా చూసి మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలకు నాయకులకు భవిష్యత్తులో సముచిత స్థానం లభిస్తుందని భరోసా ఇచ్చారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.