22.7 C
Hyderabad
Homeతాజా వార్తలుపార్ట్‌టైం అధ్యాపకుల చాక్‌పీస్‌ డౌన్‌

పార్ట్‌టైం అధ్యాపకుల చాక్‌పీస్‌ డౌన్‌

📰 Generate e-Paper Clip

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాలలో పార్ట్‌టైం అధ్యాపకులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చాక్‌పీస్‌ డౌన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తరగతి గది బోధనకు దూరంగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్ట్‌టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డా. కొర్ర రాజేందర్‌ మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి తమ సేవలకు తగిన గుర్తింపు కల్పించాలని కోరారు. ఉద్యోగ భద్రతతో పాటు న్యాయమైన హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో పార్ట్‌టైం అధ్యాపకుల పాత్ర కీలకమని, ప్రభుత్వం, విశ్వవిద్యాలయ అధికారులు సానుకూలంగా స్పందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం చీఫ్‌ అడ్వైజర్‌ డా. చింతం ప్రవీణ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డా. వాణిదేవి, ట్రెజరర్‌ డా. మౌనిక, ఉమెన్‌ కన్వీనర్‌ డా. భాగ్యమ్మ, అడ్వైజర్లు డా. యశోదర, డా. సద్గుణ, డా. రమాదేవి, డా. ప్రసాద్‌, డా. రాజేంద్రప్రసాద్‌, డా. రాజ్‌కుమార్‌, డా. జయప్రకాష్‌, డా. సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. కళాశాలలోని వివిధ విభాగాల పార్ట్‌టైం అధ్యాపకులు, సంఘం ప్రతినిధులు కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.