22.7 C
Hyderabad
Homeతెలంగాణనిరుపేద మెడిసిన్ విద్యార్థికి విద్యాఫౌండేషన్‌ అండ

నిరుపేద మెడిసిన్ విద్యార్థికి విద్యాఫౌండేషన్‌ అండ

📰 Generate e-Paper Clip

స్టడీ మెటీరియల్‌ కోసం రూ.32 వేల ఆర్థిక సహాయం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: నిరుపేద మెడిసిన్‌ విద్యార్థికి విద్యాఫౌండేషన్‌ ఆర్థిక చేయూతనందించింది. జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడిసిన్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఎలిగేటి అఖిల్‌కు స్టడీ మెటీరియల్‌ కొనుగోలు నిమిత్తం రూ.32 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధి వడ్డేపల్లి టీఎన్‌జీవోస్‌ కాలనీ ఫేజ్‌-2లోని విద్యాఫౌండేషన్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు బిల్ల మహేందర్‌, గౌరవ సలహాదారు గురిజాల తిరుపతిరెడ్డి విద్యార్థికి ఈ మొత్తాన్ని అందించారు.

పట్టుదలకు చేయూత.. ఆశయానికి భరోసా

ఈ సందర్భంగా బిల్ల మహేందర్‌ మాట్లాడుతూ.. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ అఖిల్‌ నిరాశ చెందకుండా చదువుపై దృష్టి సారించి వైద్య విద్యలో సీటు సాధించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న అఖిల్‌ పట్టుదల మరెందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థి పరిస్థితిని అమెరికాలో ఉంటున్న కొండపల్లి దీప్తికి తెలియజేయగా, ఆమె స్పందించి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ఆమె సహకారంతోనే ఈ సాయం అందించగలిగామని పేర్కొన్నారు.

భవిష్యత్తుకు బలమైన పునాది

ప్రతిభ, పట్టుదల ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. అఖిల్‌ వంటి విద్యార్థులకు సమాజంలోని దాతలు, సేవా సంస్థలు, విద్యావంతులు తమకు తోచినంత సహాయం అందిస్తే వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసినట్లవుతుందని పేర్కొన్నారు. ఒకరి చిన్న సహకారం విద్యార్థి జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరింతమంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో విద్యాఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు ఉదయశ్రీ ప్రభాకర్‌, కాంచనపల్లి అనిత, కడుదుల సోమన్న, బిల్ల సరిత తదితరులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.