రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరెల్లి కిరణ్ కార్యదర్శిగా పల్లెబోయిన నాగరాజు కోశాధికారిగా పల్లె రవి వంశీ మోహన్
అక్షరశక్తి,హైదరాబాద్: తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ (టీడీఎంయూ) నూతనంగా ఆవిర్భవించింది. యూనియన్‌కు రిజిస్ట్రేషన్ నంబర్ 468/2026గా నమోదైంది.టీడీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడిగా అరెల్లి కిరణ్, రాష్ట్ర కార్యదర్శిగా పల్లెబోయిన నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కౌడగాని మోహన్‌రావు, కోశాధికారిగా పల్లె వంశీ మోహన్, సహాయ కార్యదర్శిగా బూర నగేష్ గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి, గౌరవ సలహాదారుగా రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా దాసరి ధనుంజయ, సలేంద్ర రవీందర్ ఎంపికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న డిజిటల్ మీడియా జర్నలిస్టులను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. డిజిటల్ మీడియా ప్రతినిధుల హక్కుల పరిరక్షణతో పాటు వృత్తిపరమైన అభివృద్ధి, సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు.డిజిటల్ మీడియా రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులకు ఎదురవుతున్న సమస్యలను సంబంధిత ప్రభుత్వ విభాగాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ను బలోపేతం చేసి డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.
