27 C
Hyderabad
Homeతాజా వార్తలుప్రెస్ క్లబ్ కమిటీని రద్దు చేయాలి బైలా కమిటీని తిరస్కరిస్తున్నాం ఎన్నికల నిర్వహణకు అడ్వైజరీ, స్టీరింగ్...

ప్రెస్ క్లబ్ కమిటీని రద్దు చేయాలి బైలా కమిటీని తిరస్కరిస్తున్నాం ఎన్నికల నిర్వహణకు అడ్వైజరీ, స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి ఎన్నికలు నిర్వహించకుంటే ఉద్యమం TUWJ (143) హెచ్చరిక

📰 Generate e-Paper Clip

ప్రెస్ క్లబ్ కమిటీని రద్దు చేయాలి

బైలా కమిటీని తిరస్కరిస్తున్నాం

ఎన్నికల నిర్వహణకు అడ్వైజరీ, స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి

ఎన్నికలు నిర్వహించకుంటే ఉద్యమం

TUWJ (143) హెచ్చరిక

అక్షరశక్తి ,వరంగల్: గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రస్తుత కమిటీని రద్దు చేసి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) డిమాండ్ చేసింది. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఈ మేరకు పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. ప్రెస్ క్లబ్ కమిటీ కాలపరిమితి ముగిసి రెండేళ్లు గడిచినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై సమావేశం విచారం వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణకు తక్షణమే అడ్వైజరీ కమిటీని ప్రకటించాలని, రెండు జిల్లాల యూనియన్ నాయకులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. గత ఎన్నికల్లో ప్రెస్ క్లబ్ కమిటీలో సభ్యులుగా నియమితులైన యూనియన్ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రకటించిన బైలా కమిటీని తిరస్కరిస్తున్నట్లు యూనియన్ స్పష్టం చేసింది. పాత బైలాను అనుసరించి ఎన్నికైన కమిటీ అదే బైలాను విస్మరించడం అనైతికమని పేర్కొంది. బైలా కమిటీ పేరుతో కాలయాపన చేయడం కుదరదని స్పష్టం చేస్తూ, ఆ కమిటీలో ఉన్న తమ యూనియన్ నాయకులు వైదొలగాలని నిర్ణయించింది.

 

గ్రీవెన్స్ లో ఫిర్యాదు..

 

సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని తీర్మానించింది. ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కోసం దశలవారీగా ఉద్యమాలు చేపట్టేందుకు యూనియన్ సభ్యులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది.

ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, రాష్ట్ర కార్యదర్శి తడక రాజనారాయణ, డెస్క్ జర్నలిస్టుల కన్వీనర్ సంకె శంకర్ రావు, రాష్ట్ర నాయకులు చిలుముల సుధాకర్, కక్కెర్ల అనిల్ కుమార్, పొగాకుల అశోక్, దొంతు నవీన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మస్కాపురి సుధాకర్, కార్యదర్శి హర్షం రాజ్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు భూరం ప్రశాంత్, కార్యదర్శి తాళ్లపల్లి వేణుగోపాల్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు నవనీత్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గోకారపు శ్యామ్ కుమార్, బొడిగ శ్రీను, ఈసీ సభ్యులు కమటం వేణుగోపాల్, శ్రీకాంత్, తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అరెల్లి కిరణ్, రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన నాగరాజు, కెమెరామెన్ అధ్యక్షుడు చందు తదితరులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.