29.2 C
Hyderabad
Homeతెలంగాణప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా బీజేపీ మహా పాదయాత్ర

ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా బీజేపీ మహా పాదయాత్ర

📰 Generate e-Paper Clip

మడికొండ చౌరస్తా నుంచి చలో కరీంనగర్‌ యాత్రకు శ్రీకారం

బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ జిల్లా కార్యదర్శి పోనగోటి వెంకట్‌రావు

అక్ష‌ర‌శ‌క్తి, మ‌డికొండ‌: దేశ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ, జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా బీజేపీ చేపట్టిన ‘చలో కరీంనగర్‌’ మహా పాదయాత్రకు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మడికొండ చౌరస్తా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో మడికొండ చౌరస్తా వద్ద యాత్రకు వెళ్లే బస్సుకు బీజేపీ వరంగల్‌ జిల్లా కార్యదర్శి పోనగోటి వెంకట్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. సీనియర్‌ నాయకుడు నాయిని కుమార్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గడ్డం మహేందర్‌, నాగవెల్లి గోపికృష్ణ, మాచర్ల రంజిత్‌, గుండాల కళ్యాణ్‌, పల్లపు యుగేందర్‌, పెట్టెం సాంబయ్య, వస్కుల భాస్కర్‌, చెన్నబోయిన శివకుమార్‌, కాట్రోతు కార్తిక్‌, గడ్డం కుమార్‌, పుల్యాల రవీందర్‌రెడ్డి, బిల్లా శ్రీనివాస్‌రెడ్డి, టాటాచారి, ప్రణయ్‌, రమేష్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.