18.7 C
Hyderabad
Homeతాజా వార్తలు*చివరి మజిలీకి చేయూత....* *ఆత్మహత్య చేసుకున్న దంపతుల అంత్యక్రియలకు ప్రభుత్వ అండ* *సీఎం రేవంత్ రెడ్డి...

*చివరి మజిలీకి చేయూత….* *ఆత్మహత్య చేసుకున్న దంపతుల అంత్యక్రియలకు ప్రభుత్వ అండ* *సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్పందించిన అధికార యంత్రాంగం* *కలెక్టర్ సత్య శారద చొరవ* *ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు* *పోస్టుమార్టం నుంచి అంత్యక్రియల వరకు దగ్గరుండి పర్యవేక్షించిన తహసీల్దార్ ఇక్బాల్*

📰 Generate e-Paper Clip

*చివరి మజిలీకి చేయూత….*

*ఆత్మహత్య చేసుకున్న దంపతుల అంత్యక్రియలకు ప్రభుత్వ అండ*

*సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్పందించిన అధికార యంత్రాంగం*

*కలెక్టర్ సత్య శారద చొరవ*

*ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు*

  1. *పోస్టుమార్టం నుంచి అంత్యక్రియల వరకు దగ్గరుండి పర్యవేక్షించిన తహసీల్దార్ ఇక్బాల్*

 

*కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్న అధికారి*

 

అక్షరశక్తి,వరంగల్: కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి, మానవత్వానికి అర్థం చెప్పేలా ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఖిలా వరంగల్ మండలంలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల చివరి మజిలీ అయిన అంత్యక్రియలను ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించేందుకు అధికారులు ముందుకు వచ్చారు. విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించారు.

 

సీఎం ఆదేశాలతో…..

 

దంపతుల మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించి, అన్ని విధాలా అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది.

 

కలెక్టర్ చొరవతో ప్రభుత్వ సహాయం

 

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రత్యేక చొరవ తీసుకొని బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చర్యలు చేపట్టారు. ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా పర్యవేక్షించడంతో పాటు, దంపతుల అంత్యక్రియలను ప్రభుత్వ ఖర్చులతో గౌరవప్రదంగా నిర్వహించేందుకు ఆర్థిక సహాయం, ఇతర ఏర్పాట్లు చేయించారు.

 

అండగా నిలిచిన తహసీల్దార్ ఇక్బాల్

 

స్థానిక తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ మానవీయ కోణంలో స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.పోస్టుమార్టం ప్రక్రియ మొదలుకొని అంత్యక్రియలు పూర్తయ్యే వరకు స్వయంగా దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కలెక్టర్ సత్య శారద, తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్‌తో పాటు అధికార యంత్రాంగానికి బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.