30.7 C
Hyderabad
Homeతాజా వార్తలునకిలీ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కలకలం...

నకిలీ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కలకలం…

📰 Generate e-Paper Clip

*తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ..

*భూముల మ్యుటేషన్‌కు యత్నం..

అక్షరశక్తి, వరంగల్:

ఖిలా వరంగల్‌ మండలంలో నకిలీ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతోపాటు ప్రభుత్వ కార్యాలయ సీలును దుర్వినియోగం చేసి నకిలీ ధ్రువీకరణ పత్రం సృష్టించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.

 

*రికార్డుల పరిశీలనతో వెలుగులోకి..

 

ఎఫ్‌ఐఆర్‌ వివరాల ప్రకారం మెహరున్నిసా బేగం పేరిట 2026 జనవరి 8న జారీ చేసినట్లు పేర్కొంటూ C/3223/2026 డి.డిస్‌ నంబర్‌తో ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ రూపొందించారు. ఈ పత్రం నిజమైనదో కాదో పరిశీలించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్‌ కోరడంతో ఖిలా వరంగల్‌ కార్యాలయ అధికారులు రికార్డులను తనిఖీ చేశారు. అయితే, సంబంధిత నంబరుతో ఎలాంటి సర్టిఫికెట్‌ జారీ చేయలేదని కార్యాలయ రికార్డులు, డిస్ట్రిబ్యూషన్‌ రిజిస్టర్‌ పరిశీలనలో తేలినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి సంబంధించిన అసలు సభ్యులందరి వివరాలను పొందుపరచకుండా నకిలీ పత్రాన్ని సృష్టించి, వ్యవసాయ భూముల మ్యుటేషన్‌కు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీతోపాటు ప్రభుత్వ కార్యాలయ సీలును ఉపయోగించిన అంశాలపై విచారణ జరపాలని కోరారు.

 

*నలుగురిపై కేసు నమోదు

ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ ఎం.డి. ఇక్బాల్‌ ఫిర్యాదు మేరకు ఏజే మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో అక్టోబర్‌ 17న ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 780/2026 నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని 318(4), 336(3), 340(2), 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శివరాత్రి మహేశ్‌ దర్యాప్తు చేపట్టారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.