26.6 C
Hyderabad
Homeతాజా వార్తలుఇంట్లో బంధించిన జయశ్రీకి న్యాయం చేయాలి

ఇంట్లో బంధించిన జయశ్రీకి న్యాయం చేయాలి

📰 Generate e-Paper Clip

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ : ఇంట్లో బంధించిన‌ గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలని దళిత, మహిళా, ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుబేదారి ఎస్సై సుమన్‌కు వినతిపత్రం అందజేశారు. డీబీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్‌, డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, నేదునూరి జ్యోతి, మాదాసి సురేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో జయశ్రీపై ఆమె అత్త మీరాబాయి, భర్త రాధాకృష్ణ గృహహింసకు పాల్పడుతూ అదనపు కట్నం కోసం వేధించారని, దీనిపై ఆమె సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం రాజీ కుదిరి హనుమకొండ రాంనగర్‌లోని ఇల్లు, హనుమకొండ చౌరస్తాలోని షాపును నోటరీ ద్వారా జయశ్రీకి రాసిచ్చినట్లు పేర్కొన్నారు. అయితే పదేళ్ల తర్వాత ఆమెతో పాటు మనవడు కార్తీక్‌, మనవరాలు తేజస్వినిని ఇంటి నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులతో జయశ్రీ సామగ్రిని తరలించేందుకు ప్రయత్నించగా ఆమె కుమార్తెతో కలిసి అడ్డుకున్నారని తెలిపారు. దీంతో మీరాబాయి, ఆమె కుమార్తెలు, అల్లుళ్లు కలిసి జయశ్రీ, ఆమె కుమార్తెను ఇంట్లో బంధించి తాళం వేసినట్లు ఆరోపించారు. బాధితులు తిండి, నిద్ర లేక ఇబ్బందులు పడుతున్నారని, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఎస్సై సుమన్‌ను కోరారు.
కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్‌, చైతన్య మహిళా సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ జంపాల కళా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సంగెం స్వరూప, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా నాయకురాలు పొడిచేటి సరళ తదితరులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.