26.9 C
Hyderabad
Homeతెలంగాణఫిగర్ నచ్చితే ఫీల్డ్ చూడడు...!!

ఫిగర్ నచ్చితే ఫీల్డ్ చూడడు…!!

📰 Generate e-Paper Clip


*రిపోర్ట్ లేకుండానే ఫైళ్ళు క్లియర్

*క్రిటికల్ కేసు ఉంటేనే సర్వే రిపోర్టు 

*ప్రైమ్ ల్యాండ్ ఫైళ్ళు లక్షలు ఇస్తేనే కదులుతాయి.

*రేటు నచ్చకుంటే రిజిస్ట్రేషన్ లో ఇబ్బందులు

*రైతులకు తెలియకుండా రికార్డులు మాయం చేస్తాడు

*నాలా కన్వర్షన్ రేటు ఫిక్స్ డ్ 

*హసన్ పర్తి తహసీల్దార్ కార్యాలయంలో అంతులేని అవినీతి

అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: వసూళ్లే లక్ష్యంగా పనిచేసే తహసీల్దార్ అతను. కాసులు చూడనిదే ఆ రోజు కంటి మీద నిద్ర ఉండదు. తనకు నచ్చిన, రేటు కుదిరిన ఫైలు ఉంటే కింది స్థాయి సిబ్బంది రిపోర్టులు, సంతకాలు అవసరమే లేదు. సమస్యాత్మకంగా ఉంటేనే జీపీఓ, ఇతర అధికారుల సర్వే, సంతకాలు చేయిస్తాడు.

కార్యాలయానికి వచ్చే ప్రతీ ఫైలు ఆయన కనుసన్నల్లోనే ఉండాలి. సక్సెషన్, మ్యుటేషన్ ఫైల్ ఫిగర్ నచ్చకుంటే గాబరా అవుతాడు…

కోపంతో స్వయంగా తహసీల్దార్ లాగిన్ లో నుండి ఫైల్ కాన్సిల్ చేస్తాడు. గ్రామానికి ఒక రేటు నిర్ణయించి అడిగిన మొత్తం ఇచ్చాకే పని పూర్తి చేస్తాడు. కార్యాలయానికి వచ్చిన వేల దరఖాస్తులను భూభారతిలో తొక్కిపెట్టి రైతుల నార తీస్తున్నాడు. తాను అడిగిన ఫిగర్ నచ్చితే అస్సలు ఫీల్డు కూడా చూడకుండా సంతకం చేసే గట్స్ ఉన్న తహసీల్దార్ అతను. ఖిలా వరంగల్,ఖాజీపేట, ఖానాపూర్ కార్యాలయాలలో అనేక ఘనకార్యాలు చేసి హసన్ పర్తి తహసీల్దార్ గా పని చేస్తున్న ఆయన చరిత్రకు అంతం లేని అవినీతి కథలు ఉన్నాయి.

డైరెక్ట్ లాగిన్ లో క్యాన్సల్ చేసిన నాలా కన్వర్షన్ అప్లికేషన్

ఫైల్ క్లియరెన్స్ లో సప”రేటు”….

 

మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని తహసీల్దార్ కార్యాలయంలోకి వచ్చే సమస్యల ఫైళ్లకు ఒక పద్ధతి ఉంటుంది. ముఖ్యంగా భూభారతి ఫైళ్ళు క్లియర్ చెయ్యాలి అంటే జీపీఓ స్థాయి నుండి మొదలు డిప్యూటీ తహసీల్దార్ వరకు అన్ని రకాల పద్ధతులతో తహశీల్దారు లాగిన్ లోకి చేరుకుంటుంది. కానీ హసన్ పర్తి తహసీల్దార్ కార్యాలయంలో పద్దతి మరో విధంగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే దరఖాస్తుదారుని ఫిగర్ నచ్చితే ఫీల్డ్ విజిటింగ్ ఉండదు…జీపీఓ సంతకం ఉండదు…

ఆర్ఐ రిపోర్టు అసలే ఉండదు. ఎవరికీ సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఫైల్ సంతకం ఐపోతుంది. రైతుల దరఖాస్తులో ఏదైనా కోర్టు కేసు గానీ, సందేహంగా ఉండే క్రిటికల్ అంశాలు ఉంటే జీపీఓలు, ఆర్ఐ లాంటి వారు రిపోర్టు సమర్పించాలి.

 

ఫిగర్ నచ్చకుంటే ఫైల్ కాన్సిల్…

హసన్ పర్తి కార్యాలయంలో భూముల మ్యుటేషన్, వారసత్వ సంపద మార్పిడి ( సక్సెషన్) పూర్తి చెయ్యాలి అంటే చాలా ఖరీదు తో కూడుకున్న పని అని రైతులు బాహాటంగా చెబుతున్నారు. ఒక సక్సెషన్ ఫైలు కు కనీసంగా రెండు లక్షల పైమాటే. ఇక నాలా కన్వర్షన్ చేస్తే గుంటకు 40 వేలకు తక్కువ లేదంటూ డిమాండ్ చేస్తాడట. ఈ సంప్రదింపుల్లో ఏమైనా తేడా వచ్చినా, వారు చెప్పిన ఫిగర్ నచ్చకపోయినా తహసీల్దార్ లాగిన్ లో వారి ఫైల్ మాయం అవుతుంది. సింపుల్ గా ఎలాంటి కారణం చెప్పకుండా కాన్సిల్ బటన్ నొక్కి పెడతాడు. ఇది తెలియని రైతు తన ఫైల్ ఎందాక వచ్చిందని నెలల తరబడి తిరుగుతుంటాడు అని సమాచారం. తన సమస్య పరిష్కారం కోసం మీ సేవలో ఎంత ఫీజు కట్టినా, తాను చెప్పిన ఫిగర్ ఇవ్వకుంటే పహానీ రికార్డులు చూడకుండా నిర్ధాక్షిణ్యంగా లాగిన్ లోనుండి తొలగిస్తాడు అని తెలుస్తున్నది.

 

అక్కడ అంతా ఫిక్స్ డ్ ప్రైస్…

 

హసన్ పర్తి తహసీల్దార్ కు నాలా ఫైల్ వస్తే పండగేనట. కాసుల వర్షం కురిసే ఫైల్ అంటే చాలా స్ట్రిక్ట్ గా వసూళ్లు చేస్తాడని అంటారు. అక్కడ నాలా కన్వర్షన్ చెయ్యాలి అంటే గ్రామాన్ని బట్టి, అక్కడి డిమాండ్, ప్రైమ్ ల్యాండ్ పేరుతో ఫిక్స్ డ్ ప్రైస్ ఉంటుంది. సిటీ కి దగ్గరగా ఉండి, బాగా డిమాండ్ ఉన్న భీమరంలో ఒక గుంట నాలా కన్వర్షన్ చేస్తే 40 వేలు ఇవ్వాలి. అదే విధంగా దేవన్నపేటలో గుంటకు 30 వేలు, హసన్ పర్తి లో 25 వేలు, మడిపల్లి లో అయితే 15 వేలు ఇవ్వాల్సిందే. ఏదైనా ఒత్తిడి వచ్చి పని చెయ్యాల్సి వస్తే రిజిస్ట్రేషన్ లో ప్రతీ చిన్న విషయానికి కొర్రీ పెట్టి మరీ ఇబ్బందులకు గురి చేస్తాడు. ఎవరైనా కింది స్థాయి సిబ్బంది వచ్చి అంత ఇచ్చుకోలేరు సార్ అని చెప్పినా డోంట్ కేర్ అంటాడని కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కొంత కన్సెషన్ ఇవ్వాలని వేడుకున్నా కనికరించకపోవడం ఆ తహసీల్దార్ ప్రత్యేకత అని కార్యాలయ సిబ్బంది చెప్పుకుంటారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.