26.6 C
Hyderabad
Homeతాజా వార్తలురం*జిత్తులమారి* S4S

రం*జిత్తులమారి* S4S

📰 Generate e-Paper Clip

* ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ పేరుతో కోట్ల వంచన
* టేకుమ‌ట్ల‌ నుండే జనాలకు టోకరా
* బడుగుల శ్రమను పిలుస్తున్న జలగ
* గార్డుల జీతాల సొమ్ముతో జల్సాలు
* త‌లెత్తిచూడ‌ని సంబంధిత అధికారులు

అక్ష‌ర‌శ‌క్తి, ప్రధాన ప్రతినిధి: నిరుద్యోగం, పేదరికంతో బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వచ్చే జీవులే అతనికి “ఆహారం”. కుటుంబ పోషణకు, పొట్ట కూటి కోసం ఏదైనా చేసే వారికి కొంత ఆర్థిక “సెక్యూరిటీ” కావాలనుకునే వారే అతని పెట్టుబడి. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వేలాది మందికి ప్రైవేట్ ఏజెన్సీలు సెక్యూరిటీ సిబ్బందిగా, గార్డుగా ఉద్యోగాలు కల్పిస్తాయి. బ్యాంకులు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ లో పని చేయడానికి ఈ ఏజెన్సీ లను సంప్రదిస్తుంటాయి. దీనిని అడ్డంపెట్టుకొని S4S అనే ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ మానవ వనరులను దోచుకొని, వారి చెమట చుక్కలతో జల్సాలు చేస్తున్నది. పేపరుపై వేతనాలు చూపి…సగం సొమ్ము స్వాహా చేస్తున్నది.

* టేకుమ‌ట్ల ప్రాంతం నుండే టోకరా..

సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి చదువు సంధ్యలు లేకున్నా జనాన్ని మోసం చేసే పాఠం బాగానే చదువుకున్నాడు. భూపాల‌ప‌ల్లి జిల్లా టేకుమ‌ట్ల‌ ప్రాంతంలో చిట్టీల పేరుతో మందిని నిలువునా ముంచినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చిట్టీల పేరుతో జనాన్ని ముంచి ల‌క్ష‌లాది రూపాయ‌లు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. గ్రామంలో జనం తిరగబడటంతో అక్క‌డి నుంచి పారిపోయి, వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణానికి వ‌చ్చి కొత్త అవ‌తారం ఎత్తిన రంజిత్తుల‌మారి అత‌డు. ఎక్క‌డికెళ్లినా.. మాట‌లు చెప్ప‌డం.. మందిని ముంచ‌డం.. అక్ర‌మంగా డ‌బ్బులు సంపాదించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తెలిసిన మిత్రుల ద్వారా అతని కన్ను ఏజెన్సీ బిజినెస్ పై పడింది. అంతే… అతని పంట పండింది. ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఖాతాల పేరుతో మోసాలకు తెర తీశాడు. జీతాల మోసంతో ఉద్యోగుల పొట్ట కొట్టి కోట్లు కూడబెట్టాడు.

వరంలా మారిన S4S

గత కొంత‌ కాలంగా వ‌రంగ‌ల్‌ లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ పేరుతో న‌యా దందా మొద‌లు పెట్టాడు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డులను నియమిస్తూ, వారి నుండి అనధికారికంగా మూడు వేల నుండి ఐదు వేల రూపాయలు వరకు దండుకుంటున్నాడు. తన ఏజెన్సీ విస్తరణలో ఆసుపత్రులకు కాసుల ఎర వేసి ఏజెన్సీ ను దక్కించుకుంటాడని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంద‌రు పేరున్న రాజకీయ నాయ‌కులు, అధికార పార్టీ నేతల పేర్లు, అధికారులు, విలేక‌రుల‌ పేర్లు చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలుస్తోంది. జీతం పూర్తిగా ఇవ్వడం లేదని అడగడమే పాపం… ఈ రంజిత్తులమారి ఇంటికి పిలిచి దెబ్బల రుచి చూపిస్తాడని ఒక బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒక ఏజెన్సీ నే బంగారు గ‌నిగా మార్చుకొని తన దందాను నగరం అంతా విస్తరించాడు. చూస్తుండ‌గానే.. ఏజెన్సీ దందాపై ప‌ట్టుసాధించి, అంతా నా ఇష్టం.. నాకెవ్వ‌డు ఎదురు చెప్పేది..! అనే స్థాయికి చేరుకొని అడ్డూ అదుపులేని అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నాడు. ఇంత జ‌రుగుతున్నా ఏజెన్సీ ముసుగులో ఉద్యోగుల పీలుస్తున్నా సంబంధిత శాఖాల అధికారులు మాత్రం త‌మ‌కేమీ ప‌ట్టన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం అనేక అనుమానాల‌కు తావిస్తోంది.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.