25.5 C
Hyderabad
Homeతెలంగాణలా పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్...

లా పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్…

📰 Generate e-Paper Clip

*అరుణోదయ కళాశాలలో లా విద్యార్థుల చూచిరాత

*ఎదేచ్చగా ఫోన్లు, పుస్తకాలతో మాస్ కాపీయింగ్

*కాపీయింగ్ కు ఇన్విజిలేటర్ల సహకారం

*డబ్బులు ఇచ్చి మరీ కాపీయింగ్

 

అక్షరశక్తి, హనుమకొండ: దేశానికి మూలస్థంభంగా నిలిచే న్యాయ వ్యవస్థ లోకి వెళ్లాల్సిన విద్యార్థులు గతి తిప్పుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని లా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. భీమరంలోని అరుణోదయ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ సెంటర్ లో ఎల్ఎల్బీ రెండు,మూడు, ఐదవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల్లో లా విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. విద్యార్థులకు కళాశాలలో ఇన్విజిలేటర్ లు వీరికి పూర్తి సహకారం ఇస్తున్నారని తెలుస్తుంది.స్వయాన ఇన్విజిలేటర్ లు పుస్తకాలు, ఫోన్ లు, చిట్టీలు అందించి సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాకతీయ యూనివర్సిటీ లా కాలేజీ, ఆదర్శ లా కళాశాల, యంజేపీ లా విద్యార్థులు అరుణోదయ కళాశాల లో ఓపెన్ గా మాస్ కాపీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు గానూ ఇన్విజిలేటర్ లకు విద్యార్థులు డబ్బులు ఇస్తున్నారని, దీని వల్ల పరీక్షల కోసం ప్రిపేర్ అయిన వారు నష్టపోతున్నారని కొందరు విద్యార్థులు అంటున్నారు. ఇదే విషయాన్ని కాకతీయ యూనివర్సిటీ అధికారులకు పిర్యాదు చేసినా కనీసం చర్యలు కూడా తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.