అక్షరశక్తి హైదరాబాద్: జరిగిన జనసేన పార్టీ సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గురించి మీకు పెద్దగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన సేవాతత్వం అలాంటిది. ఆయన ఎందరికో సహాయం చేశాడు. ముడువేల మంది రైతులకు వెన్నుదండుగా నిలబడ్డాడు. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశాడు. ఎవరికో ఎందుకు 2010లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి, కోట్లాది రూపాయలు అప్పు అయినప్పుడు.. పవన్ కళ్యాణ్, చిరంజీవి నాకు ఎంతో సహాయం చేశారు. నాకు ఒక మూల స్తంభంగా నిలబడ్డారు. ఇది నాకు వాళ్ళు ఇచ్చిన లైఫ్. ఈ జీవితం మొత్తం వాళ్ళ ఆశయం కోసం, వాళ్ళ లక్ష్యం కోసం పని చేస్తాను. నాకు చేతనైనంత సాయం చేస్తాను. నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశ లేదు. ఎటువంటి పదవీకాంక్ష లేదు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అయితే గొప్పవాడిగా ఉండడానికి ప్రయత్నించు, లేదా ఒక గొప్ప వాడికి అండగా ఉండు. నేను ఇదే ఫాలో అవుతాను. అందుకే నేను వాళ్లకు అండగా ఉంటున్నాను.. ఉంటాను కూడా.. అని చెప్పుకొచ్చారు.