Thursday, September 19, 2024

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

Must Read

మెడిక‌ల్ అడ్మిష‌న్‌లో విద్యార్ధులు స్థానిక‌త‌ను కోప్పోతారు

అక్షరశక్తి, సుబేదారి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హనుమకొండ జిల్లా కన్వీనర్ సుజిత్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మెడికల్ అడ్మిషన్లలో స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన జీవో 33 లో పేర్కొన్న స్థానికతను తెలిపే నిబంధనలు తెలంగాణ మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు పట్ల శాపంగా మారిందని అన్నారు. ఆరేపల్లి సుజిత్ మాట్లాడుతూ.. 1979లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం విద్య, ఉద్యోగాల విషయంలో 646 జీవో విడుదల చేసిందని దాని ప్రకారం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 85 శాతం సీట్లు స్థానికతగా, 15 శాతం ఓపెన్ క్యాటగిరీగా పేర్కొన్నారు. 2014 రాష్ట్ర విభజన చట్టంలో 10సంవత్సరాల పాటు విద్యాలయాల ప్రవేశాల్లో ఇదే నిబంధనను అమలు చేయాలని స్పష్టం చేసిన కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి 2017లో అదే జీవో ప్రకారం కొనసాగించింది. ఆ ప్రక్రియ ఈ 2024 జూన్ 2 వరకు మాత్రమే వర్తించగా ఈ ఏడాది మెడికల్ అడ్మిషన్లలో స్థానికతను నిర్ధారిస్తూ ఇచ్చిన జీవో 33 విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1979, 2017లో జారీ చేసిన ఉత్తర్వుల్లో రెండు అంశాలను మాత్రమే కొత్త జీవోలో పొందు పరిచి దాన్నే స్థానికతగా పేర్కొడం అనేది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడమే అన్నారు. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు ఇక్కడ చదివితే స్థానికులుగా పరిగణించేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ ప్రక్రియను పక్కన పెట్టి నీట్ పరీక్ష రాయడానికి ముందు నాలుగు సంవత్సరాలు ఈ ప్రాంతంలో చదివితేనే స్థానికతగా పరిగణిస్తామని జీవో 33 లో పేర్కొనడం జరిగింది. ఈ విధానం ద్వారా స్థానికులే స్థానికేతరులుగా మారి విద్యార్థులు నష్టపోతారని, ఇక్కడ పదవ తరగతి పూర్తి అయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం ఎంతోమంది విద్యార్థులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బార్డర్ ప్రాంతంలో ఉండే విద్యార్థులు వారికి ఉన్న వెసులుబాటు, తదితర కారణాలవల్ల పక్క రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి తిరిగి మన ప్రాంతానికి వచ్చి వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు మెడికల్ అడ్మిషన్ కేటాయింపు ప్రక్రియలో ఈ జీవో ద్వారా స్థానికతను కోల్పోతారని, స్వరాష్ట్రంలోని విద్యార్థులు అవకాశాలు తగ్గుతాయి అన్నారు. ప్రభుత్వం ఇవేవీ ఆలోచించకుండా స్వరాష్ట్ర విద్యార్థులకి అన్యాయం చేసే విధంగా వారి యొక్క నిర్ణయ ప్రక్రియ ఉండడం సరికాదని మండిపడ్డారు. ఇప్పటికైనా పునరాలోచన చేసి గత ప్రక్రియలాగా 6వతరగతి నుండి ఇంటర్ వరకు 7 యేండ్లలో కనీసం 4యేండ్ల ప్రతిపదికగా స్థానికతను నిర్దారించే ప్రక్రియను, దానితో పాటు హైకోర్టు సూచించిన విధాన్ననైనా కొనసాగించి స్వరాష్ట్రంలోని విద్యార్థులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img