Thursday, September 19, 2024

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

Must Read

ఎంజీఎం ఆసుపత్రి హెచ్ఓడీలతో సమీక్షించిన కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళితో కలిసి ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోగులకు మెరుగైన వైద్యం అందించుటకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత విభాగాల హెచ్ఓడీలతో కలెక్టర్ కులంకషంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంజీఎం ఆస్పత్రికు ప్రతిరోజు సుమారు 2000 మంది అవుట్ పేషెంట్ వస్తున్న దృష్ట్యా ఓపి యూనిట్ను వయోవృద్ధుల వార్డుకు మార్చాలని, వయోవృద్ధుల వార్డును కాకతీయ మెడికల్ కళాశాలలోని పి ఎం ఎస్ ఎస్ వై కు మార్చుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న ఓపి వార్డును నవీకరించి రోగులు, అటెండెంట్స్ ల విశ్రాంతి కొరకు ఏర్పాటు చేయాలన్నారు. రోగుల సౌకర్యార్థం ఓపి లో చీటీలు అందించే కౌంటర్ల సంఖ్య పెంచాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ మురళి, ఆర్ ఎం ఓ లు శ్రీనివాస్, మురళి, శేషు, రేడియాలజీ బయో కెమిస్ట్రీ, పాథాలజీ, రేడియో థెరపీ, పీడియాట్రిక్స్ తదితర విభాగాల హెచ్ ఓ డి లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img