Thursday, September 19, 2024

గ్రామపంచాయతీలలో ఓటర్ల జాబితా ప్రచురణ

Must Read

-అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో ఆయా గ్రామ పంచాయతీల వార్డుల వారిగా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగిందని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గ్రామపంచాయతీల ఓటర్ల జాబితా, అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా రూపకల్పన పై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వారు గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ నోటిఫికేషన్ జారీ చేసిన క్రమంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం మండల స్థాయిలో కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏవైన అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చన్నారు. ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. ఈ సమావేశానికి హాజరైన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల నోటిఫికేషన్, ప్రచురణ, అభ్యంతరముల స్వీకరణ విషయమై వివరించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్ మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు హనుమకొండ, పరకాల ఉన్నాయన్నారు. జిల్లాలో మొత్తం 210 గ్రామపంచాయతీలు ఉండగా వాటిలో1986 వార్డులు ఉన్నాయన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల వారీగా మొత్తం ఓటర్లు 365828 ఉన్నారన్నారు. గ్రామపంచాయతీ ఓటర్ల తుది జాబితా ఈనెల 28వ తేదీన ప్రచురణ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డిఎల్పిఓలు గంగా భవాని, షర్ఫుద్దీన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్యాంసుందర్, నిశాంత్, రజినీకాంత్, ఎండి. నేహాల్, ప్రవీణ్ కుమార్, మణి, లక్ష్మణ్, రవి, సయ్యద్ ఫైజుల్ల, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img