Thursday, September 19, 2024

అంతర్జాతీయ చిత్రకళా పోటీల్లో స్వర్ణ పతకాల పంట

Must Read

అక్షరశక్తి,కాజీపేట: పి.ఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ వరంగల్ ” ఫ్రాగ్రాన్స్ ఆఫ్ ఆర్ట్ బడ్స్ – 2024″ అంతర్జాతీయ చిత్ర కళా పోటీలలో విద్యార్థులలో దేశభక్తి, క్రీడలకు సంబందించిన, సైన్స్ అభివృద్ధి పర్యావరణ అనుకూలమైన మొదలైన చిత్రాలపై అవగాహన పెంపొందిచుట లో విద్యార్థులకు యంగ్ ఎన్వోయిస్ ఇంటర్నేషనల్ వారు చిత్ర కళా పోటీలను నిర్వహించారు. ఇందులో పి ఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ వరంగల్ నుండి 8 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 20 మంది విద్యార్థులకు జ్యూరీ గౌరవ పతకాలు లభించాయి. విద్యార్థులను ప్రోత్సచహించిన ప్రిన్సిపాల్ పి.సుభాషిణి, ఆర్ట్ టీచర్ వెంకన్న కి కూడా ప్రశంస పత్రాలు అందజేశారు. బహుమతి పొందిన విద్యార్ధులకు విద్యాలయ ప్రిన్సిపాల్ అసెంబ్లీ లో బహుమతులను అందజేశారు. గతం లో కూడా అనేక పోటీలలో పాల్గొని కేంద్రీయ విద్యాలయ పేరు ప్రకాశింప చేస్తున్న విద్యార్థుల ను సీనియర్ టీచర్ చిత్రకళా ఉపాద్యాయుడు అన్నబత్తుల వెంకన్న ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ఇలాంటి పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొనేటట్లు చేసి వారి నైపుణ్యం, సృజనాత్మక శక్తి ని వెలికి తీయాలని, వీరిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన విద్యార్థులు కూడా చాలా సంఖ్యలో పాల్గొని విజయాలు సాదించాలని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img