- విటులు, నిర్వాహకులను అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
- పరారీలో మరో నలుగురు
మానుకోట జిల్లా కేంద్రంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఈమేరకు మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మహబూబాబాద్ పట్టణంలో కొంత మంది ముఠాగా ఏర్పడి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తునట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో మహబూబాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు పట్టణంలోని రెడ్డిబజార్ లో గల గృహంపై దాడి చేశారు. అందులో ఉన్న విటులతోపాటు, నిర్వాహకులను అదుపులో తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బానోత్ రవి, బాధావత్ సరోజ, మాలోత్ మంగిలాల్ లోకేష్, భూక్య కెన్కి, బాధావత్ రాములు ఉన్నారు. మహబూబాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రెండు కాటన్ బాక్స్ ల నిరోద్ పాకెట్లు, పది మొబైల్ ఫోన్స్, ఒక ఆటోతోపాటు రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.
Must Read