ట్రైలర్ టాక్ ఎలా ఉందంటే..?
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది.
విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. చిరంజీవి 152వ చిత్రం కావడంతో కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. రామ్ చరణ్‌కు సరసన పూజా హెగ్డే నటించారు.
మెగాస్టార్ 152వ చిత్రం కాబట్టి మంగళవారం సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు తెలంగాణ, ఏపీ సహా కర్ణాటక, తమిళనాడులో 152 థియేటర్స్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. థియేటర్లలో ఈ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఆ తర్వాత సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు యూట్యూబ్‌లో విడుదల చేసారు. . ప్రస్తుతం ఆచార్య ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దివ్య వనం ఒకవైపు.. తీర్ధ జలం ఒకవైపు.. నడుమ పాద ఘట్టం అంటూ రామ్ చరణ్ వాయిస్‌తో ప్రారంభమయ్యే ఈ సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది.
మొత్తంగా ఆధ్యాత్మికతను, నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. కొరటాల శివ ఆచార్య సినిమాను తనదైన సోషల్ మెసెజ్‌తో తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఇక ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం.