Thursday, September 19, 2024

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి

Must Read

అక్షర శక్తి, హాసన్ పర్తి : వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు భీమారంలో ని రైతు వేదిక వద్ద లబ్ధిదారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి. ఈరోజు అసెంబ్లీ ఆవరణంలో రెండవ విడత 1,50,000 రుణమాఫీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హాసన్ పర్తి మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. లక్షలోపు రుణమాఫీ చేసి మళ్లీ లక్షన్నర లోపు రైతుల ఖాతాల్లో జమ చేసిందని. రెండవ విడతగా రుణమాఫీ 6.40 లక్షలు రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం 6.190 కోట్లు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. రైతు అప్పు సంక్షోభం నుండి విముక్తిచేయడం రైతు చరిత్రలో లిఖించదగ్గశుభ పరిమాణం అన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పని మాడి మా తిప్పని ప్రభుత్వం అని గుర్తు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు మరియు లబ్ధిదారులు ముఖ్యమంత్రి అ నుముల రేవంత్ రెడ్డి మూడవ విడత రెండు లక్షలు ఆగస్టు 15 లోపు కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తీరుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తంగేళ్లపల్లి తిరుపతి కిసాన్ సెల్ మండల అధ్యక్షులు వట్టి శ్రీనివాస్ రెడ్డి. బండ చంటి రెడ్డి. పెగడపల్లి పిఎసిఎస్ చైర్మన్ చల్ల గోపాల్ రెడ్డి. చిర్ర విజయకుమార్.బండారి మొగిలి. ఏరుకొండ శ్రీనివాస్ . పల్లె దయాకర్. సతీష్. చాణిక్య రెడ్డి. బుర్ర సురేందర్ గౌడ్. రేణిగుంట్ల ప్రభాకర్. రామంచ ఐలయ్య. గోవర్ధన్. కృష్ణ.కాంగ్రెస్ పార్టీనాయకులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img