Tuesday, September 10, 2024

గోపాల్ ఆచార్య టాకీస్ బ్యానర్‌లో కొత్త సినిమా

Must Read
  • విజ‌య‌ద‌శ‌మి రోజున లాంఛ‌నంగా ప్రారంభం
  • ఔత్సాహిక న‌టులు, క‌ళాకారుల‌కు అవ‌కాశం

అక్ష‌ర‌శ‌క్తి, ఫిల్మ్‌న‌గ‌ర్‌: గోపాల్ ఆచార్య టాకీస్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ప్రొడక్షన్ నంబర్ 1 గాంధీనగర్‌లో సహ నిర్మాత ఎం అరుణకుమారి నివాసంలో విజయదశమి రోజున లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు గోపాల్ ఆచార్య నిర్మాతగా వ్యవహ‌రిస్తూ, స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు తాను అడ్మిన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న క‌లంస్నేహం, స్వ‌ర‌స్నేహం, కథాస్నేహం గ్రూపుల్లో గ‌ల ప్ర‌తిభ గ‌ల ఔత్సాహికుల‌కు ఈ చిత్రంలో అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా సురభి నాటక రంగంలో నాటకాలు వేస్తూ కళామతల్లి కరుణకు నోచుకోని కళాకారులకు అవకాశం ఇ స్తున్నామని కథా రచనలో ప్రావీణ్యం ఉండి ఎక్కడా అవకాశం లభించని కథా రచయితలను ప్రోత్స హించే వేదిక కథాస్నేహం నుండి కొందరు రచయితలకు కథా చర్చలో పాల్గొనే అవకాశం అలాగే పాటలు రాసే నైపుణ్యం ఉ న్న రచయితలని కలంస్నేహం సంస్థ నుండి గుర్తించి అవకాశం కల్పిస్తున్నామని గోపాల్ ఆచార్య తెలిపారు. చక్కని గాత్రం ఉండి పాడటానికి అవకాశం రాని గాయకులను స్వరస్నేహం సంస్థ ద్వారా గుర్తించి పాటలు పాడే అవకాశం కల్పిస్తున్నామని దర్శక నిర్మాత గోపాల్ ఆచార్య వెల్ల‌డించారు.

గోపాల్ ట్రెండ్ సెట్ చేస్తాడు.. తాజ్

నృత్య దర్శకులు తాజ్ మాట్లాడుతూ… ఈ చిత్రంలో ఆరు పాటలకు నృత్య దర్శకత్వం వహించడం పూ ర్వ జన్మ సుకృతమని, ఆ ఆరు పాటలు ట్రెండ్ సెట్ చేస్తాయని గోపాల్ ఆచార్య బాణిలు అద్భుతంగా ఉ న్నాయని తెలిపారు. స్క్రీప్ట్ రైటర్ గోలి రామకృష్ణ మాట్లాడుతూ… 24 ఫ్రేమ్స్ మీద మంచి పట్టు ఉన్న దర్శకులు గోపాల్ ఆచార్య అని, ఒక అద్భుతమైన కథ తయారు కావడానికి వారి సృజనాత్మకత, వారి ఆలోచన, ఊహాశక్తి, స్క్రిప్ట్ రచనలో వారి నైపుణ్యత చాలా గొప్పది అని కొనియాడారు. స్క్రీప్ట్ రచనలో తాను భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

పాట‌లు అద్బుతం.. అరుణ‌కుమారి

సహా నిర్మాత అరుణకుమారి మాట్లాడుతూ… ఒక మంచి కథ ఉంటేనే మంచి చిత్రం తీయగలమని, మంచి కథ రావడం కోసం సంవత్సరం పాటు కృషి చేసి కథను తయారు చేసుకున్నామ‌ని తెలిపారు. సినిమాను ఎంత ప్రేమిస్తున్నారో ఆ శ్రమలోనే అర్థం అ వుతుందని కొత్తవారితో నిర్మిస్తున్న మంచి సినిమాను ప్రేక్షకులు అల‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంద‌ని తెలిపారు. ఈ సినిమాలో పాటలు మరో అద్భుతమని ఆమె తెలిపారు. నటిమణి నేహారెడ్డి మాట్లాడుతూ.. గ్లామర్ పాత్రలు రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఎటువంటి అశ్లీలతకి తావు లేనటువంటి పాత్రని ఇవ్వడం ఒక వరంగా భావిస్తున్నానని అన్నారు. ఇటువంటి అద్భుతమైన పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాత గోపాల్ ఆ చార్యకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇందులో దర్శక నిర్మాత గోపాల్ ఆచార్య, సహా నిర్మాత అరుణ కుమారి, నృత్య దర్శకులు తాజ్, స్క్రిప్ట్ రైటర్ గోలి రామకృష్ణ, నటీమణి నేహారెడ్డి, కలం స్నేహం మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img