హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రియాంక నీట్ కోచింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో ఉన్న ఎక్సెల్ కాలేజీలో చేరింది. అక్కడే హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో ఏమైందో ఏమో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్‌లోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు.. ప్రియాంకను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందిందని వైద్యులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.