మానుకోట టౌన్ సీఐ సతీష్
అక్షరశక్తి, మహబూబాబాద్: మహబూబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు బాబునాయక్ తండాలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ బానోతు రవి నాయక్, టౌన్ సీఐ సతీష్ మాట్లాడుతూ యువత తప్పు దోవ పడుతున్నారని, అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, యువత ఉజ్వల భవిష్యత్ నిర్మాణం వైపు అడుగులు వేయాలని కోరారు. మాదక ద్రవ్యాల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని టౌన్ సీఐ సతీష్ హెచ్చరించారు. అనంతరం టౌన్ సీఐ సతీష్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భూక్యా బాసు భూక్యా బిచ్చ, బానోత్ భాస్కర్ నాయక్, హనుమనాయక్, భూక్యా సక్రమ్, శీను నాయక్, రమేష్, చిన్న హనుము స్వామి, శంకర్ మేస్త్రి, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Must Read