Monday, September 9, 2024

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుద‌ల‌

Must Read

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి. హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్‌లోని గోల్డెన్ జూబ్లీ హాల్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి మే 14 వరకు జరిగాయి. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,275 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత సాధించ‌గా, అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్ విభాగంలో 87 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు మే 26న విడుదల చేస్తామని ముందుగానే ప్రటించినా ఒకరోజు ముందే రిజల్ట్స్ విడుదల చేయడం విశేషం. ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకుల ప్రకటన ఉంటుంది. వీటి ఆధారంగానే సీట్ల భర్తీ చేయ‌నున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img