అక్షరశక్తి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన నూతన రెవెన్యూ (ROR) -2024 ముసాయిదా బిల్లుపై తెలంగాణ తహసీల్దార్లు సంఘం (TGTA) ఆధ్వర్యంలో ఆగస్టు 11వ తేదీ మధ్యాహ్నం 2.00 గంటలకు వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. చర్చలో ముఖ్య అతిథులుగా *”తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం (DCA) అధ్యక్షులు V.లచ్చి రెడ్డి , ప్రధాన కార్యదర్శి K.రామకృష్ణ , TGTA రాష్ట్ర అధ్యక్షులు.రాములు, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహన్ ప్రధాన కార్యదర్శి పాక రమేష్ పాల్గొననున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా బిల్లుపై చర్చించి రైతులు, పట్టాదారులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా TGTA ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని, రైతులు రెవెన్యూ ఉద్యోగులు బార అసోసియేషన్ అడ్వకేట్స్ ప్రజలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహ్మద్ ఇక్బాల్(అసోసియేట్ ప్రెసిడెంట్), బండి నాగేశ్వర్ రావు(అసోసియేట్ ప్రెసిడెంట్), విక్రమ్ కుమార్ (జాయింట్ సెక్రెటరీ), PS ఫణి కుమార్ (వైస్ ప్రెసిడెంట్) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.