అక్షరశక్తి, జనగామ : జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మహా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ విభాగం, సాంస్కృతిక విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ బోనాల పండుగలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ పీవోలుగా డాక్టర్ జానీ నాయక్, ఎన్ఎస్ఎస్ పీఓ, సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో అబ్బురపరిచే అలంకారాల మధ్య పోతరాజుల వేషధారణలు, శివసత్తుల నడుమ ఉత్సవం వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా జఫర్గడ్ మండల ప్రెస్ అధ్యక్షులు ఉపేందర్, పాల్గొనగా కార్యక్రమ ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రిన్సిపాల్ డి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాంప్ సెక్రటరీ కిరణ్ కుమార్, కల్చరల్ క్లబ్ సహాయ కోఆర్డినేటర్ గణేష్ కందగట్ల, సీనియర్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పాఠశాల పీఈటీలు రాజు, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.