Thursday, September 19, 2024

ఇందిరా మహిళా శక్తి యూనిట్లును త్వరగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

Must Read

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయాల్సిన యూనిట్లు త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల ప్రగతిపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసే ఉత్పత్తులపై బ్రాండింగ్ (గుర్తింపు) ఉండాలని, సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వాలని, టీం లీడర్లు సభ్యులు తయారు చేసే ఉత్పత్తులపై పర్యవేక్షణ చేయాలని, కొత్త యూనిట్లను త్వరగా ఏర్పాటు చేయాలని, ప్రారంభించిన యూనిట్లు సక్రమంగా నడిచేట్లు చూడాలని, తయారు చేసిన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, సభ్యులకు ఆదాయం వచ్చేటట్లు చూడాలని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలు, కుట్టు కేంద్రాలు, పాలిచ్చే గేదలు ఇచ్చి సభ్యులు ఆదాయం పెరిగేట్లు చూడటం, కోళ్ల ఫారాలు, వాహనాల ద్వారా చేపల అమ్మకం, పాల కేంద్రాలు, మీసేవ కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఆహార తయారీ కేంద్రాలు మరియు ఇతర ఉత్పత్తి యూనిట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. హనుమకొండ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర మరియు జి డబ్ల్యూ ఎం సి లో మహిళా శక్తి క్యాంటీన్లు ఆగస్టు 10 లోపు ఏర్పాటు చేయాలని అన్నారు. రంగంపేట లో ఈవెంట్ మేనేజ్మెంట్ కేంద్రం, హాసన్ పర్తి లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మహిళా శక్తి కేంద్రాలు తయారు చేసే ఉత్పత్తులపై బ్రాండింగ్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. అన్ని మండలాల్లోని గ్రూపులలో కొత్త సభ్యులను చేర్పించే కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా శక్తి యూనిట్లు త్వరగా నెలకొల్పేందుకు బ్యాంకు రుణాలు మంజూర అయ్యేట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జి డబ్ల్యూ ఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వా కడే, డిఆర్ఓ గణేష్, డి ఆర్ డి ఓ. పి డి నాగ పద్మజ, ఎల్ డి ఎం శ్రీనివాస్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img