అక్షరశక్తి, జనగామ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు జనగామ జిల్లాకు చేరుకున్నాయి. త్వరలో తెలంగాణ శాసనసభకు జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు అలాగే ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించడం తోపాటు వారిలో మనోధైర్యాన్ని నింపడం కోసం మంగళవారం జనగామ జిల్లా సబ్ డివిజన్ పోలీసుల ఆ ధ్వర్యంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డి, జనగా మ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జనగామ ఎస్సై సృజన్, అరుణ్, తిరుపతి, శ్వేత, నర్మెట ఎస్సై శ్రీకాంత్, బచ్చన్న పేట ఎస్సై సతీష్, తరిగొప్పుల ఎస్సై నరేష్, కేంద్ర బలగాలకు చెందిన అధికారులు, ఇతర పోలీస్ సి బ్బంది పాల్గొన్నారు.