అక్షరశక్తి, హన్మకొండ క్రైం: కారులో మంటలు వ్యాపించి దగ్ధమైన ఘటన మంగళవారం రాత్రి హన్మకొండలో చోటుచేసుకుంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో నయీంనగర్ అన్ లిమిటెడ్ మాల్ ఎదురుగా రోడ్ మీద కారు AP 16 AV 6336 కాలుతున్నదని ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్పాట్‌కు చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో కారు పక్కనే ఉన్న మరొక కారుకు మంటలు అంటుకొని పాక్షికంగా కాలిపోయింది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సుమారుగా మూడు లక్షలు నష్టం జరిగిందని, బ్యాటరీ ఓవర్ హీటా లేక వేరే ఏదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉందని ఫైర్ ఆఫీసర్ అంగోత్ నాగరాజు పేర్కొన్నారు.