Friday, July 26, 2024

‘జబర్దస్త్’ చలాకీ చంటికి తీవ్ర అస్వస్థత ? ఐసీయూలో చికిత్స ?

Must Read

‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన చలాకీ చంటి తీవ్ర అస్వస్థకు గుర‌య్యారు. గుండెనొప్పికి గురైన చంటిని కుటుంబ స‌భ్యులు శనివారం హైదరాబాదులోని కేర్ ద‌వాఖాన‌కు త రలించా రు. ప్రస్తుతం చంటిని ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్టు గుర్తించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.
‘జబర్దస్త్’ కామెడీ షోతో చంటీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు రావడంతో మధ్యలో ‘జబర్దస్త్’ షోను విడిచిపెట్టినా.. అప్పుడప్పుడు కనిపించేవాడు. అంతేకాదు, ఈటీవీ ప్లస్‌‌లో ప్రసారమైన ‘నా షో నా ఇష్టం’ షోకు యాంకర్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ సీజన్-6లో ప్రత్యక్షమయ్యాడు. ప్రేక్షకుల నుంచి కూడా మంచి మార్కులు కొట్టేసినా.. చివరి వరకు నిలవలేకపోయాడు. అయితే, ఇటీవల చంటి సినిమాల్లో గానీ, టీవీ షోస్‌లో గానీ కనిపించడం లేదు. ఇంతలో ఈ వార్త బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసి చంటి అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img