హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ సంచల నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కొరడా ఝలిపిస్తున్నారు. ఈక్రమంలోనే నారాయణగూడ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో యథేచ్ఛగా నడుస్తున్న హుక్కా పార్లర్లపై సీఐ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం టాస్క్ ఫోర్స్ రైడ్స్ లో తేటతెల్లమైంది. సీఐ వ్యవహారంపై సీవీ ఆనంద్ ఫైర్ అయ్యారు. సీఐ శ్రీనివాస్ రెడ్డి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.