Saturday, May 18, 2024

కందాల శోభారాణి యాది సభను విజ‌య‌వంతం చేయాలి

Must Read
  • ప్రొఫెసర్ డాక్ట‌ర్ ఈసం నారాయణ
  • హ‌న్మ‌కొండ ప్రెస్‌క్ల‌బ్‌లో గోడ‌ప‌త్రిక ఆవిష్క‌ర‌ణ‌
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : పీడిత ప్రజల గొంతుక, కేయూ అధ్యాపకురాలు దివంగ‌త డాక్ట‌ర్ కందాల శోభారాణి యాది సభను విజ‌య‌వంతం చేయాల‌ని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేట‌ర్‌ డాక్ట‌ర్ ఈసం నారాయణ పిలుపునిచ్చారు. ఈనెల 15న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవన్‌లో నిర్వ‌హించ‌నున్న స‌భ‌కు విద్యార్థులు, మేధావులు త‌ర‌లిరావాల‌ని కోరారు. ఈ మేర‌కు హన్మకొండ ప్రెస్ క్లబ్‌లో ఉద్యమ మిత్రుల ఆధ్వర్యంలో బుధ‌వారం శోభారాణి యాది సభ గోడ పత్రికను ప్రొఫెసర్ డాక్ట‌ర్ ఈసం నారాయణ ఆవిష్కరించారు. అనం తరం ఆయ‌న మాట్లాడుతూ… పేదలు, మహిళలు, ఆదివాసీలు, అణగారిన వర్గాల కోసం అహర్నిషలు కృషి చేసిన శోభారాణి అనారోగ్యంతో మరణించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. శోభారాణి మరణించినా ఆమె సాహిత్యం నిత్యం స‌జీవంగా ఉంటుందని, ఆమె ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం, మహిళలల అణిచివేతపై ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. అందుకే శోభారాణి సాహిత్య సామాజిక సేవలను మరోమారు మ‌న‌నం చేసుకొని భావి తరాలకు అందించడానికి డాక్ట‌ర్ కందాల శోభారాణి యాది సభను ఈనెల 15న‌ ఉదయం పది గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సభలో వక్తలుగా ప్రొఫెస‌ర్ హరగోపాల్, ప్రొఫెస‌ర్ తాటికొండ రమేశ్, ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక ఎడిట‌ర్ కే శ్రీనివాస్, టీజేఎస్ అధ్య‌క్షులు ప్రొఫెస‌ర్ కోదండరాం, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్, మాన‌వ హ‌క్కుల నేత బాధావత్ రాజు త‌దిత‌రులు పాల్గొంటార‌ని తెలిపారు. యాది సభను జయప్రదం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల‌కు డాక్ట‌ర్ ఈసం నారాయ‌ణ విజ్ఞప్తి చేశారు. కార్య‌క్ర‌మంలో ఎస్ రాంబ్రహ్మం, నల్లెల్ల రాజయ్య, రాజేంద్రప్రసాద్, అవినాశ్, లావణ్య, సాయి, భరత్, జయంత్ తదితరు లు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img