Saturday, May 4, 2024

మ‌ళ్లీ భ‌య‌పెడుతున్న క‌రోనా… ఒక్క రోజే ప‌దివేల కేసులు

Must Read

దేశంలో కరోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు 5, 6.. 7 వేలు మాత్రమే నమోదు అవుతూ ఉండగా.. ఏప్రిల్ 12వ తేదీ ఒక్క రోజే 10 వేల పాజిటివ్ కేసులు నమోదు కావటం విశేషం. చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తూ వెళుతుంది వైరస్. 24 గంటల్లోనే 10 వేల 158 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 45 వేలకు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎనిమిది నెలల్లో ఈ స్థాయిలో కొత్త కేసులు రావటం ఇదే తొలిసారి. ఎక్స్​బీబీ1.16 అనే వేరియంట్ కారణంగా భారత్​లో కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆసుపత్రుల్లో చేరికలు మాత్రం తక్కువగానే ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో 10 నుంచి 12 రోజుల్లో కొత్త కేసులు సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గతంలో అంత తీవ్రత లేదని.. ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉన్నా.. ఈ సమయంలోనే మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 24 గంటల్లో కరోనాతో 15 మంది చనిపోయారు. 200 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముంబై, ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రైవేట్ వార్డులు ఓపెన్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img