అక్షరశక్తి, హనుమకొండ: వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( కుడా ) చైర్మన్‌గా సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గురువారం పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు, నాయకులు సుందర్‌రాజ్‌యాదవ్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సుందర్ రాజ్ యాదవ్‌ను 64 డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధిక రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ యువజన నాయకులు ఆకుతోట ప్రశాంత్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.