- లెజెండ్ క్లాసెస్ ఇన్‌స్టిట్యూట్ బంపర్ ఆఫర్
- మీలో ఎవరు లక్షాధికారి పేరున కార్యక్రమం
- ఫిబ్రవరి 5న హన్మకొండలో నిర్వహణ
అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండలోని లెజెండ్ క్లాసెస్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మీలో ఎవరు లక్షాధికారి పేరున వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో గెలుపొందిన విజేతకు రూ. 1 లక్ష నగదు అందజేయనున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మాత్రమే ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి.. ? ప్రైజ్ మనీ గెలుచుకోవాలంటే ఏం చేయాలి..? ప్రోగ్రాం కండీషన్లు ఏంటి.. ? అనే అంశాలను కోచింగ్ సెంటర్ అధినేత సత్యనారాయణచారి వివరించారు. ముందుగా ప్లేస్టోర్ నుంచి లెజెండ్ క్లాసెస్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు నిర్వాహకులు ఇచ్చే 5 ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలి. ప్రతి రోజు ముగ్గురు చొప్పున 5 రోజుల్లో మొత్తం 15 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 15 మంది నుంచి శనివారం ఉదయం ఐదుగురిని లెజెండ్ క్విజ్ షోకి ఆహ్వానించనున్నారు. వీరికి ఫిబ్రవరి 5 (ఆదివారం) మీలో ఎవరు లక్షాధికారి ప్రోగ్రాంను నిర్వహించనున్నారు. ఇందులో విజేతకు రూ. 1 లక్ష ప్రైజ్ మనీ అందజేయనున్నారు. నేటి నుంచి యాప్‌లో ప్రశ్నలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు మాత్రమే అర్హులని, ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సత్యనారాయణచారి కోరారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌పై అవగాహన కల్పించడంతోపాటు నిరుద్యోగులకు ఆర్థిక చేయూతనందిచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9908797575, 7032322339 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.