అక్షరశక్తి , ములుగు: ఆసియాలోని అతిపెద్ద గిరిజన కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క మహా జాతరలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న పలువురిని సర్కారు ప్రత్యేకంగా ప్రశంసించింది. ఈ మేరకు ఆదివారం జాతరలో మంత్రి సీతక్క ఉత్తములకు జ్ఞాపకాలు అందజేసింది ఈ కార్యక్రమంలో ఎన్టీవీ భక్తి టీవీ వనిత టీవీ తరపున విధులు నిర్వహించిన ఎడ్ల సంతోష్కు మంత్రి సీతక్క స్వయంగా పురస్కారం అందజేశారు. వార్త కవరేజ్ లో సంతోష్ చూపించిన చొరవను మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.