అక్షరశక్తి, కమలాపూర్ : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు ఆదేశాల మేరకు పల్లె డాక్టర్ రోహిత్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. మొత్తం 83 మంది పాల్గొనగా 37 మందికి డెంగ్యూ, మలేరియా పరీక్షలు చేయగా నెగిటివ్ గా వచ్చినట్లు నిర్ధారించడం జరిగిందన్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు. గ్రామంలో డాక్టర్ రోహిత్ గడపగడపకు వెళ్తూ ఫీవర్ తో పాటుగా ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రమణ,హెచ్ ఈ ఓ రవీందర్, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణారెడ్డి, హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్, ఏఎన్ఎం సంపూర్ణ, ఆశా కార్యకర్తలు రామ, అనిత, శ్రీమతి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.