అక్షరశక్తి, హసన్ పర్తి : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం హన్మమకొండ జిల్లా ఆర్డీవో ఎన్ వెంకటేష్ ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధరణిలో తలెత్తుతున్న సమస్యలను, అర్జీలను పరిశీలించారు. ధరణి సంబంధించిన రికార్డులన్నింటిని క్షుణ్ణంగా తనఖీ చేశారు. ఈ మేరకు స్థానిక డిటి. రహీం పాషా, ఆర్ ఫాజిల్,తో పాటు ఇతర సిబ్బంది ధరణికి సంబంధించిన అన్ని రికార్డులను, వివరాలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్ళగా, వాటిని పరిశీలించారు.