అక్షరశక్తి, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపాలిటీ లోని 16 వార్డుల్లో ప్రతి వార్డులో కనీసం 50 లక్షల చొప్పున నిధులతో సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువల పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు వార్డులలోని పలువురు కాంగ్రెస్, బీజేపీ ఆయకులు టీఆర్ ఎస్ లో చేరారు. 5వ వార్డు నుంచి 19 మంది బీజేపీ ముఖ్య నాయకులు పి యాకన్న, ఉపేందర్ ల నేతృత్వంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఇతర సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.